TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎంకి హాలీవుడ్ నటి ఈ-మెయిల్

Published on: Tue Apr 28, 2015 1:18PM

 

హాలీవుడ్ నటి కేరళ ముఖ్యమంత్రికి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిండెంట్ కు ఈమెయిల్ చేసింది. హాలీవుడ్ నటి ఏంటీ కేరళ ముఖ్యమంత్రికి ఈ మెయిల్ చేయడమేంటి... ఇంతకీ ఆ ఈ మెయిల్ లో ఏముందనుకుంటున్నారా... హాలీవుడ్ నటి పమేలా అండర్ సన్ జంతు హక్కుల ఉద్యమకర్త. అయితే బుధవారం కేరళలో జరగబోయే చారిత్రక త్రిస్పూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులు వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారుచేసిన బొమ్మలను ఉపయోగించాలని ఈమెయిల్ లో కోరింది. ఉత్సవం కారణంగా ఏనుగులను గొలుసులతో కట్టేసి ఎండలో తిప్పడం సబబు కాదని అన్నది. నిర్భందించిన ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే.. అని పమేలా అండర్ సన్ ముఖ్యమంత్రికి రాసిన ఈమెయిల్ లో పేర్కొన్నారు. పమేలా అండర్ సన్ నుంచి మెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి తిరువనంతపురం తిరిగి రాగానే ఈ విషయం పై చర్చిస్తామని అధికారులు చెప్పారు.