కేరళలలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఆగని దాడులు
Published on: Sun Mar 5, 2017 2:17PM
.jpg)
కేరళలలో ఆర్ఎస్ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తలను తెచ్చినవారికి కోటీ రూపాయలు నజరానా ఇస్తామని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు కేరళలలో ఉద్రిక్తలకు దారి తీశాయి. దాడులు, ప్రతిదాడులతో ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా కొయిలండీ జిల్లాలోని కీజయూర్‌లో ముగ్గురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి ఆర్ఎస్ఎస్ నేతలు కేసు పెట్టినప్పటికి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.


