TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చదువులోనే కాదు..రేపుల్లోనూ టాపే

Published on: Sun Feb 26, 2017 5:39PM

దేశంలో అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే టక్కున వచ్చే సమాధానం కేరళ. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముందుగా అక్షరాస్యతకే అధిక ప్రాధాన్యమిస్తారు. ప్రజలు కూడా ఏంతో సౌమ్యులని పేరు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపే. విద్యావంతులు, చైతన్యవంతులు ఉన్న ఈ రాష్ట్రంలో తాజాగా విడుదలైన గణాంకాలు జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్క 2016లోనే ఆ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాదాపు 16,960 నేరాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో అత్యాచారాలు 2,568. ఇక లైంగిక దాడుల హిస్టరీ చూస్తే మహిళలపై 1,644 ఘటనలు జరగ్గా, చిన్నారులపై 924 ఘటనలు జరిగాయి. ఇవి 2015లో మహిళలపై 1,263 పిల్లలపై 720 చోటు చేసుకున్నాయి. తాజాగా సినీ నటి భావనపై లైంగిక వేధింపుల కేసు కారణంగా కేరళలో జరుగుతున్న ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి.