TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కౌన్‌ బనేగా కేరళ సీఎం..!

Published on: Thu May 19, 2016 5:26PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ గాడ్స్ ఓన్ స్టేట్ కేరళలో వామపక్షాలు మళ్లీ పాగా వేశాయి. 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో అధికార యూడీఎఫ్ 46 స్థానాలు సాధించి పరాజయం పొందింది, ఎల్డీఎఫ్ 91 సీట్లను గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతా బాగానే ఉంది కాని సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారా..? అని రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్, సీపీఎం రాష్ట్ర  మాజీ కార్యదర్శి పినరయి విజయన్ సీఎం రేసులో ఉన్నారు.

 

కేరళతో పాటు దేశ రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరుపొందిన అచ్యుతానందన్ 90 ఏళ్లు పైబడినా ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు సచ్ఛీలుడిగా పేరుంది. గత ఎన్నికల్లో సీఎం కుర్చీకి రెండు అడుగుల దూరంలో ఆగిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని మంతనాలు సాగిస్తున్నారు. ఇక విజయన్ సంగతి చూస్తే సుమారు 15 సంవత్సరాల తర్వాత తిరిగి రాజకీయ ప్రవేశం చేసిన విజయన్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో రెండుసార్లు విజయన్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో అచ్యుతానందన్ సీఎంగా ప్రచారం కావడంతో విజయన్ తప్పుకున్నారు. అయితే ఈ సారి విజయన్ పోటీలో నిలిచారు. వయోభారంతో అచ్యుతానందన్ తప్పుకుంటారని అందరూ భావించారు. కానీ ఇటీవల ఆయన మాట్లాడుతూ రేసులో నేను ఉన్నానని స్పష్టం చేశారు. దీంతో కేరళ సీఎం ఎవరన్నది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. రేపు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి స్థానంపై ఉత్కంఠకు తెరపడే అవకాశాలున్నాయి. లేదంటే ఇద్దరూ బాధ్యతలు పంచుకోవచ్చని ఊహగానాలు వినిపిస్తున్నాయి.