TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘోర విమాన ప్రమాదం...12 మంది మృతి

Published on: Tue Oct 28, 2025 4:01PM

 

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఈ తెల్లవారుజామున కిచ్వా టెంబోకు వెళ్తున్న విమానం బయలు దేరిన కొద్దిసేపటిలో కెన్యాలోని క్వాలే కౌంటీలో కుప్ప కూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల  కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం చేత దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ సంస్థలు, అత్యవసర సేవా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా పైలట్ విమానాన్ని ముందుకు సాగించినట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 

పొగమంచు మరియు గాలిలో దట్టమైన మేఘాలు ఉండటం వల్ల పైలట్‌కు విజిబిలిటీ తగ్గి నియంత్రణ కోల్పోయిన అవకాశం ఉందని కూడా స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కెన్యా సర్కార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.