TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిదంబరాన్ని తొలగించాలి గడ్కరి డిమాండ్‌

Published on: Fri Dec 16, 2011 1:41PM

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని తక్షణం పదవి నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్‌ గడ్కరి డిమాండ్‌ చేశారు. చిదంబరంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.చేనేత కార్మికుల సమస్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా గడ్కరి శుక్రవారం హైదరాబాదు వచ్చారు. ఇందిరాపార్క్‌ వద్ద జరుగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. క్రీడాకారులు ధ్యాన్‌చంద్‌, సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని గడ్కరి పేర్కొన్నారు.