అవును కేజ్రీవాల్ కు 2కోట్లు ఇచ్చాను...

 

ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నాడని అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ కు డబ్బులు ఇచ్చింది పారిశ్రామిక వేత్త శర్మ అని కపిల్ మిశ్రా చెప్పిన నేపథ్యంలో.. మిశ్రా వ్యాఖ్యలపై స్పందించిన శర్మ  'అవును! కేజ్రీవాల్ కు 2 కోట్లు ఇచ్చాను... కానీ కపిల్ మిశ్రా ఆరోపిస్తున్నట్టు లంచం కాదు' అన్నారు. కపిల్ మిశ్రా అనవసరంగా ఆరోపణలు గుప్పిస్తున్నారను.. తాను పదే పదే అనడం వల్లే బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుందని.. నేను రెండు కోట్లు ఇచ్చాను.. అది పార్టీకి విరాళంగా ఇచ్చాను...ఈవిషయం ఆప్ పార్టీ నేతలందరికీ తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. తానిచ్చిన మొత్తాన్ని డీడీ రూపంలో ఇచ్చానని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతికి తావులేదని ఆయన చెప్పారు.