మోడీ గారు వారిని ఫాలో అవకండి...
Published on: Wed Mar 8, 2017 3:55PM
.jpg)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రధాన మంత్రి మోడీ పై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి మోడీపై కామెంట్లు విసిరారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మోడీని ఉద్దేశించి... ‘స్త్రీ ద్వేషం ప్రదర్శించడం, మహిళలను దూషించడం, భయపెట్టడం లాంటివి చేస్తున్న వ్యక్తుల ట్విటర్ ఖాతాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫాలో అవడం ఆపేసి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


