TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ మౌనం.. నిజంగా వ్యూహాత్మకమేనా?

Published on: Mon Apr 27, 2026 4:29PM

తెలంగాణ రాజకీయ యవనికపై  భారత రాష్ట్ర సమితి  అధినేత కే. చంద్రశేఖరరావు తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల  ఎంట్రీ సంచలనాలకు వేదికైంది. పార్టీ ప్రకటన సందర్భంగా తన కన్నతండ్రిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో ఎదిగిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు  తండ్రి బాటను వీడి సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం  చర్చనీయాంశమైంది.  తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించిన ఆమె, గతంలో తండ్రి స్థాపించిన పార్టీ పేరులోని అక్షరాలనే మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. అన్నిటికీ మించి తన తండ్రిని మరమనిషి, గుంటనక్కల చేతిలో బంది అంటూ ఓ రేంజ్ లో విమర్శించడంతో అంతా దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందా అని ఇసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.  

ముఖ్యంగా కేసీఆర్ మౌనం వ్యూహమా? భయమా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యల వెనుక పటిష్టమైన, పకడ్బందీ వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.  అయితే కేసీఆర్ మౌనమే ఇప్పుడు అందరికి అర్ధం కాకుండా పోయింది.  తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలపైనే కాదు.. ఆమెను  నుండి కవితను బహిష్కరించిన నాటి నుండి ఇప్పటి  వరకూ కేసీఆర్   ఏ సందర్భంలోనూ తన కుమార్తె గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు.

 కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కవిత చేసిన అవినీతి ఆరోపణల నుంచి తనను మరమనిషిగా అభివర్ణించడం వరకూ కవిత ఎంత పరుషంగా మాట్లాడినా కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.  దీంతో కేసీఆర్ మౌనం వ్యూహాత్మక, కన్నబిడ్డ అన్న మమకారమా? అన్న చర్చ జరుగుతోంది.   కేసీఆర్ మౌనం ఇలాగే కొనసాగితే.. రానున్న రోజులలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత భారీగా చీల్చడం ఖాయమన్న భావన పార్టీ వర్గాలలోనే వ్యక్తమౌతోంది.