న్యూస్ ఛానల్స్ కు కేసీఆర్ వార్నింగ్..!! 

ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి మహేష్ శ్రీ రాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆ వ్యాఖ్యలకు హిందూ సంఘాలు మండిపడటమే కాకుండా.. ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి.. చివరికి పోలీసులు ఆయనను నగర బహిష్కరణ కూడా చేసారు.. అలానే పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేసారు.. అయితే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారి పట్ల కేసీఆర్ సర్కార్ ఇకపై కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది.. అలానే న్యూస్ ఛానల్స్ పై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని చూస్తుంది.

 

 

కొన్ని ఛానల్స్ మతపరమైన సున్నిత అంశాలపై అభ్యంతరకర చర్చలు నిర్వహిస్తుండటంతోనే పరిస్థితి విషమిస్తోందని పోలీసు అధికారులు, ప్రభుత్వానికి రిపోర్టును అందించారు.. సమీక్ష జరిపిన ప్రభుత్వం.. ఛానల్స్ లో ప్రసారమయ్యే అంశాలపై నిఘా ఉంచాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. డీజీపీ సూచన మేరకు ఛానల్స్ లో వచ్చే వార్తలను నిరంతరం సమీక్షిస్తూ ఉండటానికి నగర పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు అయినట్టు తెలుస్తుంది.