అఖిలపక్షాన్ని సీరియస్ గా తీసుకోని కేసిఆర్ ?
Published on: Thu Dec 6, 2012 1:25PM

తెలంగాణా ఫై ఈ నెల 28 న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన అఖిల పక్ష సమావేశాన్ని టిఆర్ఎస్ అధినేత కే సి ఆర్ ఓ జోక్ గా అభివర్ణించారు. ఎఫ్డి ఐ ఓటింగ్ విషయం ఫై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లను ఓట్లను పొందేందుకే ఆ పార్టీ అధిష్టానం ఈ తేదీని ప్రకటించిందని ఆయన అన్నారు.
గతంలోనే ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చిదంబరం పార్లమెంట్ లో ప్రకటించారని, అయితే, అది ఇప్పటి వరకూ ఏర్పాటు కాలేదని ఆయన విమర్శించారు.దీనిని బట్టి ఈ సమావేశాన్ని కేసిఆర్ అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.
తమ పార్టీ తరపున కేసిఆర్ ఈ సమావేశానికి హాజరవుతారని, అలాగే అన్ని పార్టీలు తమ అధ్యక్షులను మాత్రమే దీనికి పంపించాలని టిఆర్ఎస్ శాసనసభ్యుడు తారక రామారావు విజ్ఞప్తి చేశారు.


