ఆ ఇరవై మంది ఓటమే కేసీఆర్ ప్రధాన లక్ష్యం..!

 

కేసీఆర్ మాటే కాదు నిర్ణయాలు కూడా దూకుడుగా ఉంటాయని అందరూ అంటుంటారు.. ఓ వైపు కేంద్రంలో బీజేపీ, ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది.. అలానే తెలంగాణలో కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి, ప్రజలు ప్రభుత్వం మీద సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్ళటం మంచిదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ కూడా విసిరారు.. ప్రతిపక్షాలు కూడా మేమూ సిద్ధం అంటూ ప్రతిసవాల్ విసిరాయి.. అయితే తెరాస నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు పైగా గెలుస్తామని, తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా పోతుందని భావిస్తోన్నారు.

'వంద సీట్లు గెలవడం.. ప్రతిపక్షం లేకుండా చేయడం' దీన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా కేసీఆర్ దాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.. తెరాస గెలుపు కష్టంగా ఉన్న ఒక ఇరవై నియోజకవర్గాల లిస్ట్ రెడీ చేపించారట.. అక్కడున్న బలమైన విపక్ష నేతలను ఓడించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యమట.. ఆ ఇరవై మంది విపక్ష నేతలను ఓడించడం కోసం కేసీఆర్ ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నారట.. ఆ ఇరవై మంది ఓడిపోతే తెలంగాణలో తెరాసకు ఎదురే ఉండదు, అసలు ప్రతిపక్షమే ఉండదని కేసీఆర్ అనుకున్నారట.. ఇదే జరిగితే తెలంగాణలో అధికారం పొందాలని ఆశపడుతున్న కాంగ్రెస్ కు ఏపీలో పరిస్థితే ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి తెరాస అనుకున్నట్టు నిజంగా వచ్చే ఎన్నికల్లో వందకి పైగా సీట్లు గెలిచి ప్రతిపక్షం లేకుండా పోతుందా? అంటే.. ఆ ఇరవై మందిని ఓడించగలిగితే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల భావన.. కానీ ఆ ఇరవై మందిని ఓడించడం అంత ఈజీ కాదు.. వాళ్ళని ఓడించే వ్యూహాలు కేసీఆర్ ఎలా రచిస్తారో చూడాలి అంటున్నారు.. అయితే ఆ ఇరవై మంది ఎమ్మెల్యేల లిస్ట్ లో విపక్ష పార్టీల బలమైన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, కోమటిరెడ్డి, మల్లు భట్టి, రేవంత్ రెడ్డి, డి.కె అరుణ లాంటి నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.. 

ఇక బీజేపీ నుండి లక్ష్మణ్, కిషన్ రెడ్డి కాగా.. టీడీపీ నుండి సండ్ర వెంకటవీరయ్య పేర్లు వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి ఈ నేతల్ని ఓడించడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. ముందస్తు ముందస్తు అంటూ వంద సీట్ల టార్గెట్ కోసం కేసీఆర్ ముందు నుండే అస్త్రాలు సిద్ధం చేస్తున్నారుగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.