TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌.. మీ నాన్న పేరు నిలబెట్టాలి: కేసీఆర్

Published on: Thu May 30, 2019 1:16PM

 

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. "జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున అభినందనలు. ఇదొక ఉజ్వలమైన ఘట్టం. తెలుగు ప్రజలందరూ ప్రేమానురాగాలతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుంది. సీఎం జగన్‌ వయసు చిన్నది.. బాధ్యత పెద్దది. శక్తి, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం మీకుందని గత 9ఏళ్లలో ప్రస్పుటంగా నిరూపించారు. మనం చేయాల్సింది కత్తులు దూసుకోవడం కాదు.. కరచాలనం. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలి. జగన్‌.. మీ నాన్న పేరు నిలబెట్టాలి. ఒక్కసారి కాదు.. మూడునాలుగు సార్లు .. జగన్‌ రాష్ట్రాన్ని పాలించాలని దీవిస్తున్నాను" అని కేసీఆర్ అన్నారు.