TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం కుంభకోణంలో కేసీఆర్ అల్లుడు

Published on: Mon May 1, 2023 5:54PM

మద్యం కుంభకోణం కేసులో ఈడీ మూడో సప్లిమెంటరీ ఛార్జీ షీటును దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం నాలుగు ఛార్జీషీట్లను దాఖలు చేసింది. తాజా ఛార్జీషీటులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్ పైన ఈడీ కీలక అభియోగాలు మోపింది. కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది. ఈ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ ది కీలక పాత్ర అని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సౌత్ గ్రూప్ కు లాభం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. లిక్కర్ వ్యవహారంలో అరుణ్ పిళ్లై... కవితకు ప్రతినిధిగా వ్యవహరించినట్లు పేర్కొన్నది.

లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాల ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నట్లు ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ ద్వారా భూములు కొన్నట్లు ఈడీ పేర్కొంది. తాజా ఛార్జీషీటులో ఫీనిక్స్ శ్రీహరి, కవిత భర్త అనిల్ పేర్లను ప్రస్తావించింది. ఫీనిక్స్ శ్రీహరి పాత్రపై ఈడీ అందులో పేర్కొంది. శ్రీహరి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పేర్కొంది. శ్రీహరి నుండి కవిత 25వేల చదరపు అడుగుల స్థలం కొన్నట్లుగా ఉందని పేర్కొంది. మార్కెట్ వ్యాల్యూ రూ.1760 కాగా, కవిత రూ.1260 చెల్లించినట్లుగా పేర్కొందని సమాచారం. ఇక ఎన్గ్రోత్ క్యాపిటల్ లో అనిల్ భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొంది.కెసీఆర్ కూతురుతో బాటు అల్లుడు ఈ స్కాంలో ఉండటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.