కేసీఆర్.. సింగపూర్ టు మలేసియా.. ఆన్ రోడ్..
Published on: Sun Aug 24, 2014 4:32PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొలి విదేశీ పర్యటనలో వున్నారు. సింగపూర్‌లో రెండు రోజులపాటు పర్యటించిన ఆయన ఆ తర్వాత సింగపూర్ నుంచి మలేసియాకు రోడ్డు మార్గంలో వెళ్ళారు. సింగపూర్ నుంచి మలేసియా వరకు జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించారు. శనివారం ఉదయం 11 గంటలకు బయల్దేరిన ఆయన సాయంత్రం 4 గంటలకు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేసియా నుంచి ఆయన ఆదివారం నాడు తిరిగి ఇండియాకు వస్తారు.


