కేసీఆర్‌కు కొత్త కాదు.. పడ్డ కష్టమే మళ్లీ మరోసారి..
Published on: Sun Feb 20, 2022 5:28PM
నిజానికి, ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలకు, ఎప్పుడో దశాబ్దాలకు ముందు జరిగిన సంఘటనలకు సబంధం లేక పోవచ్చును, కానీ, కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఇప్పటిది కాదని చెప్పేందుకు అయితే, అప్పుడెప్పుడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన యూపీఏలో మంత్రిగా ఉండగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు చేసిన తొలి ప్రయత్నం గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు.
విషయం ఏమంటే, యూపీఏ వన్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న విషయం చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాని చేర్చారు. రాష్ట్ర పతి ప్రసంగంలోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. అందుకు కొనసాగింపుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విధి విధానాలు ఇత్యాదులు చర్చించేందుకు ప్రణబ్ ముఖఖర్జీ సార్ద్యంలో ఒక కమిటీ (ప్రణబ్ ముఖర్జీ కంమిటి)ని ఏర్పాటు చేశారు. అయినా, కాలం గడచి పోతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయింది.
ఆ సమయంలో, కేసీఆర్ మొట్ట మొదటి సారిగా, కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు. యూపీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులతో ఒక ‘ప్రెషర్ గ్రూప్’ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అప్పట్లో, కేసీఆర్ పీఎస్’ గా ఉన్న, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, రాసిన ‘ నేను ..తెలంగాణ ఉద్యమంలో నా ప్రస్థానం’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ ఫ్రంట్’ ఏర్పాటు ఆలోచనలకు సంబందించి ఇంకొన్ని చాలా కొన్ని ఆసక్తికర అంశాలను జోడించారు.
ఓ రోజు కేసీఆర్, జయశంకర్ సార్, విద్యాసాగర్ రావు ఇతర నాయకులతో పిచ్చాపాటిగా మాట్లాడుకుంతున్న సమయంలో, ప్రణబ్ ముఖర్జీ కమిటి ఆశించిన విధంగా పనిచేయడం లేదనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అదే సమయంలో కేసేఆర్, యధాలాపంగా యూపీఏలో ప్రెషర్ గ్రూప్ ఏర్పాటు చేసి, వత్తిడి పెంచితే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. అనడమే తడవుగా, దగ్గరలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ క్వార్టర్ కెళ్ళి, ఆయనతోనూ అంతే క్యాజువల్’గా, యూపీఏలో ఉంటూనే, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు కరుణానిధి, పవార్ సహా ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో ఒక ఫ్రంట్ లాంటిది ఏర్పాటు చేద్దామని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్’ లోతుపాతుల్లోకి వెళ్ళకుండా యథాలాపంగా అలా చేస్తే బానే ఉంటుంది’ అన్నారు.
అంతే కేసీఆర్ ఇక చర్చను పొడిగించకుండా, బయటకు వచ్చి, యూపీఎలో ఉంటూనే, ప్రాంతీయ పార్టీలు ఒక గ్రూప్’ గా ఉండబోతున్నామని మీడియా చెవిలో ఉదేశారు. అంతే ఒక్కసారిగా, ఢిల్లీలో రాజకీయ దుమారం చెలరేగింది. యూపీఏలో సంక్షోభం, కేసీఆర్ కన్వీనర్’గా ప్రాంతీయ పార్టీల ప్రషర్ గ్రూప్ ఏర్పాటు, అంటూ నేషనల్ ఛానల్స్’లో స్క్రోలింగ్స్, బ్రేకింగ్ న్యూస్’ ప్రసారం చేశాయి. తోపొలిటికల్ హీట్ పీచ్’కి చేరింది.
యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలర్ట్ అయ్యారు. సోనియా పొలిటికల్ అడ్వైజర్ అహ్మద్ పటేల్. లాలూ ప్రసాద్’కు ఫోన్ చేసి ఏమి జరిగిందని వాకబు చేశారు. ఇదంతా చూసి లాలూ ప్రసాద యాదవ్’ ఖంగు తిన్నారు. ఆవెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ, కేసీఆర్ ప్రకటనను ఖండించారు. కేసీఆర్ చెప్పింది అబద్ధం. మామధ్య అలాంటి చర్చే జరగ లేదు, అని ప్రకటించారు. అలాగే, కరుణానిధి, శరద్ పవార్ కూడా కేసీఆర్ అసలు తమని కలవనే కలవలేదని మీడియా ముఖంగానే చెప్పారు. అక్కడితో కేసీఆర్ ప్రప్రధమ ఫ్రంట్ ఆలోచన. మొగ్గలోనే పుటుక్కు మంది. కేసీఆర్ అభాసు పాలయ్యారు.
అయితే యూపీఎ కాలంలో కేసీఆర్ మెదడులో మొగ్గ తొడిగిన, ప్రషర్ గ్రూప్ అలోచన, రాష్ట్ర విభజన జరిగి, అయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, ఆయన మెదడును తొలుస్తూనే వుంది. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ‘థర్డ్ ఫ్రంట్’ గా పురుడు పోసుకుంది. కేసీఆర్ అప్పుదు కూడా ఇలాగే, బెంగాల్ వెళ్లి మమతను, ఒరిస్సా వెళ్లి నవీన్ పట్నాయక్’ను ఇంకా ఎవరినో కలిసో వచ్చారు. అయితే, అయన పడిన ప్రసవ వేదన వృధా అయింది. చివరకు థర్డ్ ఫ్రంట్ ‘స్టిల్ బోర్న్ చైల్డ్’ (చచ్చి పుట్టిన బిడ్డ) బయట పడింది.ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అవే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో ... ఏమో ..త్వరలోనే తెలిసి పోతుంది.


