TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ తాజా వరాల జల్లు!!

Published on: Sat Aug 2, 2014 12:15PM

 

నిజంగా తెలంగాణకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజల్ని వరాల జల్లుతో తడిపేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చేసిన వరాల తాలూకు ఆనందంలో తెలంగాణ ప్రజలు వుండగానే, తాజాగా శుక్రవారం నాడు ఆయన మరికొన్ని వరాలు ప్రకటించారు. ఈసారి ప్రత్యేకంగా ఉద్యోగులు ఈ వరాల జల్లులో తడిశారు. ఆ వరాల వివరాలు...

 

1. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు వాహన సౌకర్యం

 

2. ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణం మంజూరు. నెలవారీ అలవెన్సు.

 

3. తహసీల్దార్లు సొంత జిల్లాల్లో ఉద్యోగం చేయరాదన్న నిబంధన రద్దు.