TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దీక్షా దివస్ పేరిట కేసీఆర్ కొత్త నాటకం.. టీపీసీసీ చీఫ్

Published on: Fri Nov 28, 2025 5:23PM

దీక్షా దివస్ అంటూ  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో కొత్త నాటకానికి తెరతీస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ రోజిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్ ను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న కేసీఆర్.. ఇప్పుడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

వాస్తవానికి ఉద్యమ కాలంలో కేసీఆర్ దీక్ష ఒక నాటకమన్న ఆయన దీక్ష ప్రారంభించిన మూడు రోజులకే ఆయన దీక్షను విరమించారనీ, అయితే విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తీవ్ర ఆగ్రహానికి భయపడి మళ్లీ మొదలెట్టారని గుర్తు చేశారు. అయినా తెలంగాణ రాష్ట్రం తన వల్లే సాధ్యమైందని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్, కృషి, విద్యార్థుల పోరాటమే కారణమన్నారు.