మోడీని కలిసిన కేసీఆర్

 

ఒకరేమో పీఎం..మరొకరేమో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు వేసిన సీఎం.. మరి వీరిద్దరి మధ్య భేటీ అంటే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది.. అందుకే మోడీ, కేసీఆర్ భేటీ కోసం అందరూ ఎదురుచూసారు..వీరి భేటీలో రాజకీయాలు ఏమన్నా చర్చకు వస్తాయా అని తెలుసుకుందామని ఆసక్తి కనబరిచారు..కానీ ప్రస్తుతానికి అవేం తెలియలేదు కానీ కేసీఆర్ మోడీకి వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కేంద్రం నుండి 20 వేల కోట్ల ఆర్ధిక సాయం , ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కొత్త సచివాలయం ఏర్పాటుకు స్థల కేటాయింపు, వెనకబడిన జిల్లాలకు నిధులు, రిజర్వేషన్ల పెంపుకు ఆమోదం తదితర వినతులతో కూడిన పత్రాన్ని కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. మోడీ కూడా పరిశీలించి సానుకూలంగా స్పందిస్తా అన్నట్టు తెలుస్తుంది.. అయితే వీరిద్దరి మధ్య జాతీయ రాజకీయాల చర్చ వచ్చిందా? రాలేదా? ఒకవేళ వస్తే ఏం మాట్లాడుకొని ఉంటారని అందరూ ఆలోచిస్తున్నారు.. కానీ కేసీఆర్ లేదా మోడీ నోరు విప్పేవరకు ఇది సమాధానం తెలియని ప్రశ్నగానే మిగిలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.