మోడీజీ.. తెలంగాణకి ప్రత్యేక హోదా ఇవ్వండి: కేసీఆర్
Published on: Sat Jun 7, 2014 5:11PM
.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని మోడీని కోరారు. తెలంగాణకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేసీఆర్ మోడీకి విన్నవించారు. కేసీఆర్ విజ్ఞప్తులను విన్న ప్రధాని మోడీ ఈ విషయాలను తాను పరిశీలిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.


