చండీ యాగంలో అగ్ని ప్రమాదం మంచికేనట..!!
Published on: Sun Dec 27, 2015 2:45PM

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ఆయుత చండీ యాగంలో జరిగిన స్వల్ప అగ్ని ప్రమాదం శుభసూచకమేనని విశాఖ శారదా పీఠం అదిపతి స్వరూపనందేంద్ర అంటున్నారు.‘‘పూర్ణాహుతి తర్వాత యాగశాలను దహనం చేయాలి. చండీమాత కరుణించి ముందుగానే యాగశాలను దహనం చేశారు.’’ ఆయన అన్నారు. భద్రాచలంలో అతిరాత్రి మహా యాగం చేశాక అక్కడి యాగశాల పాకలను కాల్చేసిన విషయాన్ని గుర్తు చేశారు.


