కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. రాజకీయ కోణమేనా?

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు.. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని మరియు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్టు తెలుస్తోంది.. స్థానికులకు విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానాన్ని రూపొందించింది.. దానిపై చట్టం చేసి శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి ఆమోదం కోసం పంపింది.. గత నెలలో కేసీఆర్‌ ప్రధానిని, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిసి దీనిని ఆమోదించాలని అభ్యర్థించారు.. కేంద్ర న్యాయ, హోం శాఖలు స్పందించి దస్త్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాయి.. ఈ కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం పొందటమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.. అలానే గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు.. ఉమ్మడి హైకోర్టు విభజన.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా వంటి అంశాలపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది.. అయితే కేసీఆర్ పర్యటనలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.