కేసీఆర్ గుడ్‌న్యూస్.. 80,039 ఉద్యోగాల లిస్ట్ ఇదే...
Published on: Wed Mar 9, 2022 9:47AM
బుధవారం ఉదయం 10 గంటలు అయింది. తెలంగాణ ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. కేసీఆర్ చెప్పబోయే గుడ్‌న్యూస్ ఏంటా అని ఆసక్తిగా అసెంబ్లీ ప్రసారాలు చూస్తున్నారు. ఆ టైమ్ రానే వచ్చింది. గడియారంలో 10 కొట్టింది. ఆ తర్వాత కాలం మరింత ఫాస్ట్‌గా గడిచింది. కేసీఆర్ ప్రసంగం మొదలైంది. తెలుసుగా ఆయన ముచ్చట ఎట్లుంటదో.. తెలంగాణ ప్రగతి అంటూ గొప్పలన్నీ చెప్పుకొచ్చారు. అలా అలా బాగా డబ్బా కొట్టుకున్నాక.. అప్పుడు చెప్పారు నిరుద్యోగులకు ఆ గుడ్‌న్యూస్ ఏంటో...
ఉద్యోగ ఖాళీల భర్తీకి అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ‘‘రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నారు. వారిని క్రమబద్ధీకరిస్తున్నాం ’’ అని కేసీఆర్ వెల్లడించారు.
.webp)
.webp)


