TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐజీ హాస్పిటల్ కి కేసీఆర్

Published on: Thu Apr 10, 2025 3:11PM

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ  పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో  అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.  గతంలో గులాబీ బాస్ ఏఐజీ హాస్పిటాల్‌‌కి వచ్చి హెల్త్ చెకప్ చేయించకున్నారు. సాధారణ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రజత్సోవాలను అధినేత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలో  పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం నింపిటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బీఆర్‌పార్టీ అధికారం కోల్పోయి తర్వాత నిర్వహించే  తొలి పార్టీ ఆవిర్బ సభ కావడంతో దీని విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సభలో కాంగ్రెస్  ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కి సీట్లు రాకపోవడంతో క్యాడేర్ నిరాశతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సహం నింపాటానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు.