కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-3

 

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. దేవాలయ ట్రస్టీల నియామకాల విషయంలో ఆర్డినెన్స్, 2. ఇప్పటికే ఆమోదించిన తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు, 3. తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ పేరు ఖరారు, 4. తెలంగాణ శాసనసభకు ఆంగ్లోఇండియన్ సభ్యుడిగా రాయిడిన్‌రోచ్ పేరు ఖరారు, 5. అడ్వొకేట్ జనరల్‌గా కె.రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం, 6. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసేలా వైద్య శాఖకు ఆదేశాలు, 7. జంటనగరాల్లో గతంలో రద్దు చేసిన కల్లుడిపోలు, సొసైటీలను పునరుద్ధరించాలని నిర్ణయం, 8. బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా పరిగణిస్తూ నిర్ణయం, 9. పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం దేశంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానానికి రూపకల్పన, 10. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కొత్తగా మాస్టర్‌ప్లాన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల సాయం తీసుకోవాలని నిర్ణయం, 11. అన్ని రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, అనుభవజ్ఞులు, జర్నలిస్టులతో కూడిన రాష్ర్ట సలహా మండలి ఏర్పాటుకు తీర్మానం.