TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెరమీదకు మళ్ళీ  ఫెడరల్ టెంట్? అందుకేనా కేసీఆర్ హస్తిన యాత్ర?

Published on: Wed Sep 1, 2021 10:35AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతోంది, ప్రధానంగా దేశ రాజధానిలో తెరాస పార్టీ కార్యాలయ భూమి పూజ, శంకుస్థాపన కోసమే అయినా, అంతదూరం వెళుతోంది ఆ ఒక్కపని కోసం మాత్రం కాదు. అదీ గాక, ఇలా వెళ్లి అలా రావడం లేదు. మూడు రోజులు అక్కడే మకాం చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసేఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు, వ్యూహాగానాలకు కావలసినంత అవకాశం కలిపిస్తోంది.రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 

అధికరికంగా ప్రభుత్వం విడుదల చేసిన సమాచరం ప్రకారం,ముఖ్యమంత్రి కేసిఆర్ సెప్టెంబర్ 2 న  ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన తెరాస పార్టీ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన  1300 గజాల స్థలంలో  పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడవ తేదీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు,  కేంద్ర మంత్రులతోనూ, కేసీఆర్ సమావేశ మావుతారని సమాచారం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అగ్ని పుట్టిస్తున జల వివాదానికి సంబంధించి, సంబధిత శాఖల  మంత్రులతో సమావేసమయ్యే అవకాశం లేక పోలేదని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే, కృష్ణా కృష్ణానది జలాల పంపిణి విషయంలో  కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం  ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర జల శక్తి  శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్’ను కలిసి నీటి వాటాల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర వాదనను ముఖ్యమంత్రే స్వయంగా వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అయితే, ఈ అన్నిటికీ మించి, కేసీఆర్ ఢిల్లీ యాత్రకు రాజకీయ లక్ష్యం కూడా ఉందని అంటున్నారు. గత మూడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా,  2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎలా, ప్రధాని  మోడీని గద్దె దించడం ఎలా? అనే విషయంలో విపక్ష పార్టీలు, బహుముఖ  విన్యాసాలు సాగిస్తున్నాయి. అలాగే, జాతీయ, ప్రాంతీయ, కుటుంబ పార్టీలు అన్నీ కలిస్తేనే గానీ, మోడీని ఓడించండం అయ్యే పని కాదని, ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలియంది కాదు. ఈ నేపధ్యంలో విపకః పార్టీలు, అన్ని పార్టీల ఐక్యత కోసం, సోనియా గాంధీ, రాహుల గాంధీ, శరద్ పవార్, మమత బెనర్జీ, కపిల్ సిబల్ ఇలా అనేక మంది మహా నాయకులు ఎవరి గోల వారిది అనంట్లుగా ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. అయితే, ఎదుకనో గానీ ఒకప్పుదు థర్డ్ ఫ్రంట్,ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కొంత విఫల ప్రయత్నం చేసిన, కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే కపిల్ సిబల్ విందుకు మాత్రం తెరాస పార్లమెంట్ సభ్యులు ఒకరిద్దరు హాజరైనట్లు వార్త లొచ్చాయి. కానీ ఎందుకనో పార్టీ ఆ కలయికను రహస్యంగానే దాచిపెట్టినది.  

ప్రస్తుత ఢిల్లీ యాత్రలో థర్డ్ /ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చలు కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో, ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ మరోమారు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కొంత ప్రయత్నం జరుగవచ్చని, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ జీ 23 నాయకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజరీ వాల్ వంటి కాంగ్రెస్ సారధ్య కూటమిలో చేరేందుకు సుముఖంగా లేని కీలక నేతలు కొందరిని కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.