TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజ‌వాడ‌లో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. పీకే ఫ్యాన్స్ పీక్స్‌..

Published on: Sat Feb 26, 2022 9:49AM

పీకే ఫ్యాన్స్ జోష్ ఓ రేంజ్‌లో ఉంది. త‌మ ప‌వ‌ర్ స్టార్ సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డంతో కాక మీదున్నారు అభిమానులు. ఇన్నాళ్లూ కాస్త త‌గ్గి ఉన్నా.. భీమ్లా నాయ‌క్ హిట్‌తో ఇక త‌గ్గేదేలే అంటున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. ప‌వ‌న్ సినిమాను అడ్డుకోవ‌డానికి ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా.. టికెట్ రేట్ల ధ‌ర‌లు పెంచ‌డం ఆల‌స్యం చేసినా.. రెవెన్యూ అధికారుల‌తో బెదిరింపుల‌కు దిగినా.. అవేవీ భీమ్లా నాయ‌క్ జోరును అడ్డుకోలేక‌పోయాయి. థియేట‌ర్ల‌లో దుమ్ము రేపుతున్నాయి. 

ఏపీ సీఎం ఇలా ఉంటే.. తెలంగాణ సీఎం మాత్రం టాలీవుడ్ పెద్ద‌లు అడిగిన‌వ‌న్నీ చేసేశారు. టికెట్ రేట్లు భారీగా పెంచారు. భీమ్లా నాయ‌క్ బెనిఫిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. ఐదో షో కూడా ఓకే చేసేశారు. అందుకే, ఏపీ నుంచి పెద్ద సంఖ్య‌లో ప‌వన్ ఫ్యాన్స్ తెలంగాణ వ‌చ్చి మ‌రీ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో చూశారు. 

జ‌గ‌న్ స‌ర్కారు త‌మ అభిమాన నాయ‌కుడి సినిమాకు అన్ని అడ్డంకులు సృష్టిస్తే.. తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం పీకేకు ఫుల్ స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ప్రీరిలీజ్‌కు కేటీఆర్ రావ‌డం మ‌రింత ఎంక‌రేజింగ్‌గా మారింది. అందుకే, ప‌వ‌న్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీతో త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. 

హ్యాట్సాఫ్ సీఎం సార్.. అంటూ విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ భారీ ఫ్లెక్సీని పెట్టారు పీకే ఫ్యాన్స్‌. అంత చేసినందుకు.. ఫ్లెక్సీతో త‌మ‌వంతు కృత‌జ్ఞ‌త చాటుకున్నారు ప‌వ‌ర్ స్టార్‌ అభిమానులు. బెజ‌వాడ‌లో కేసీఆర్ ఫ్లెక్సీపై సిటీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అటువైపు వెళ్లే వారంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియా గ్రూపుల్లో బాగా షేర్ అవుతున్నాయి.