TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద‌మ్ముంటే జైల్లో పెట్టండి.. బండికి స‌వాల్‌.. కిష‌న్‌రెడ్డికి వార్నింగ్‌..

Published on: Sun Feb 13, 2022 6:14PM

కొన్నినెల‌లుగా కేసీఆర్‌, బండి సంజ‌య్‌ల మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ న‌డుస్తోంది. ఈయ‌న ఆయ‌న్ను అంటారు. ఆయ‌న ఈయ‌న్ను ఆడుకుంటారు. ఇద్ద‌రి మ‌ధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో సాగుతుంటుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌దే ప‌దే సీఎం కేసీఆర్ భ‌ర‌తం ప‌డ‌తామ‌ని, అరెస్ట్ చేస్తామ‌ని, జైల్లో పెడ‌తామ‌ని అంటుంటారు. ఇక‌, కేసీఆర్ ఎప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టినా, బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడినా.. ఆ మ‌ర్నాడే బండి సంజ‌య్‌ సైతం మీడియా ముందుకు వ‌స్తుంటారు. కేసీఆర్ చేసిన ఆరోప‌ణ‌లన్నిటికీ రివ‌ర్స్ కౌంట‌ర్లు వేస్తుంటారు. కేసీఆర్ ఏది అవునంటే.. బండి అది కాద‌ని వివ‌రిస్తుంటారు. ఇలా చూసిచూసి..వినివినీ.. సీఎం కేసీఆర్‌కు విసుగు, అస‌హ‌నం వ‌చ్చిన‌ట్టుంది. లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో బండి సంజ‌య్‌పై వెట‌కారంగా సెటైర్లు వేశారు కేసీఆర్‌.

బండి సంజ‌య్‌కు చ‌దువు వ‌స్తుందో రాదో మ‌రి, ఆయ‌న్ను చూస్తే జాలేస్తుంది.. ఆ బండి సంజ‌య్‌కి బ‌దులు ఆ పార్టీ వేరే ఎవ‌రితోనైనా మాట్లాడిస్తే బాగుంటుందంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చారు సీఎం కేసీఆర్‌. 

త‌న‌ను అరెస్ట్ చేస్తామంటే భ‌య‌ప‌డ‌తాన‌ని అనుకుంటున్నారా?  రా.. ద‌మ్ముంటే అరెస్ట్ చేయి చూద్దాం.. తామేమైనా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నామా?  తామెందుకు మోడీకి, ఈడీకి భ‌య‌ప‌డ‌తామ‌ని అన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

ప‌నిలో ప‌నిగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌. కిష‌న్‌రెడ్డి త‌న‌కు మిత్రుడేన‌ని.. అయినా ఆయ‌న త‌న‌కు బ‌డ్జెట్ అర్థం కాలేద‌ని అన‌డం స‌రికాద‌ని.. ఇప్ప‌టికైతా మంచి మాట‌ల‌తో వ‌దిలేస్తున్నాన‌ని, ఇంకోసారి కిష‌న్‌రెడ్డి అలా మాట్లాడితే బాగుండ‌ద‌ని కాస్త హెచ్చ‌రిక ధోర‌ణిలో మాట్లాడారు సీఎం కేసీఆర్‌.