తెరాసలోకి వలసలు..బాబుపై కేసిఆర్ విమర్శలు

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు స్పష్టమైన ఎజెండాతోనే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలుపన్నుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు కరెంట్ ఇవ్వరాదని ఆయన అంటున్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలను దక్కించుకునేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఎంత తెలంగాణ వ్యతిరేకి కాకపోతే గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు మాయని మచ్చ అని చెప్పిస్తారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులకు చీమూ నెత్తురు ఉంటే వెంటనే ఆ పార్టీని వదిలి రావాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని టీడీపీలో ఇంకా ఎందుకు కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 11 మంది ప్రజాప్రతినిధులు ఒకేసారి మరో పార్టీలో చేరడం ఒక చరిత్ర అన్నారు.