మెగాస్టార్ బాటలో కెసిఆర్..!!

 

 KCR Family Pack Offer, kcr congress, kcr chiranjeevi, congress telangana

 

 

తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్ళిన కె.చంద్రశేఖరరావు..కాంగ్రెస్ అదిష్టానంతో విలీన౦ పై చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ సాధారణంగా ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతుంటారు. కాని ఈ సారి ఆయన మీడియాతో మాట్లాడకుండానే విమానం ఎక్కేసారు. దీంతో టీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడిందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

 

కెసిఆర్ ప్రస్తుతం ఢిల్లీలో విలీనం గురించి కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఫ్యామిలీ ప్యాకేజ్ డిమాండ్ ను ప్రస్తావించినట్లు ఢిల్లీ వర్గాల బోగట్టా. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే...తన కూతురు..కొడుక్కి పదవులను అడిగిన కెసిఆర్ హరీష్ రావు గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. తనకు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ పదవి, తన కొడుకు కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి, కూతురు కవితకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు వుంచినట్లు తెలుస్తోంది.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక...కాంగ్రెస్ ఎదిరించి పార్టీని నడపడం కష్టమని అనుకున్న కెసిఆర్...ఈ విషయంలో జగన్ రూట్ కన్నా చిరంజీవిని రూటే బెటరని భావిస్తున్నాడు.