గోడదూకితే అనర్హత వేటు వేయాలని కెసీఆర్ నిర్ణయం
Published on: Fri Jul 19, 2024 5:59PM
ఫిరాయింపులను సీరియస్ గా తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కెసీఆర్ నిర్ణయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బిఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ నేతృత్వంలో గులాబీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గులాబీ ఎమ్మెల్యేలు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. హైకోర్టులో కూడా పిటిషన్ వేయాలని నిర్ణయించిన గులాబీ పార్టీ అవసరమైతే సుప్రీంకోర్టు గడప దొక్కాలని నిర్ణయించింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ప్రోటో కాల్ పాటించడం లేదని కెటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగిందని,చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్టేజి మీదకు ఆహ్వానించలేదన్నారు. కాంగ్రెస్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని కెటీఆర్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.


