కేసీఆర్ కలవరు.. బిజెపీది కలిసే ఉత్సాహం!
Published on: Thu Jun 9, 2022 12:23PM
తమ పాలన ఎలా సాగుతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారన్నది తెలుసుకోవడానికి పూర్వం రాజులకు మంత్రుల సమాచారం బాగా వుపయోగపడేది. రవ్వంత అనుమానం వస్తే వేగులనీ పట్టణంలోకి పంపే వారు, చందమామ కథల్లో అయితే ఏకంగా రాజుగారే తోచిన మారువేషం వేసుకుని కబుర్లు చెప్పడానికి మంత్రిని కూడా తీసికెళ్లేవాడు. అలా తిరిగి ఏదో ఒక మంచి సమాచారంతోనే సాయింత్రానికి నివాసం చేరే వారు. దాడులు, తిరుగుబాటులు అలా అరికట్టేవారు.
ప్రస్తుతం అత్యాధునిక కాలంలో విపక్షాల ఎత్తులకు పై ఎత్తులలో భాగంగా పార్టీ కార్యకర్తలను, వీరాభిమానులను వూళ్లలో తిరిగి సమాచారం అందించమంటు న్నారు. ప్రధాని మోదీ ఇంకాస్త బాగా ఆలోచించి ప్రజాదర్బార్ల పేరుతో అందరూ అందరినీ కలుస్తుండ మని పార్టీవర్గీయులను ఉత్సాహపరిచేరు. దర్బార్ లో భాగంగానే ఆయన ఇటీవల హైదరాబాద్ కార్పోరేట ర్లనూ కలిసేరు. వారం దరినీ పార్టీ విజ యానికి, తెలంగాణాలో పాలనాపరమయిన లోపాల్ని అందరికీ తెలిసేలా చేయాలని, భవి ష్యత్తులో ఎమ్మె ల్యేలుగా ఎదగాలని వారిని ఉత్సాహపరిచి మరీ పంపేరు. ఇలా బిజెపి చాలా పకడ్బందీగా ఎన్నికల సన్నాహక కార్యక్రమాలు చేపడుతోంది.
రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై కూడా ప్రజాదర్బార్‌పేరిట అందరినీ కలిసి రాష్ట్రపరిస్థితులను మరింత తెలుసుకునేందుకు పూనుకుంటున్నారు. తెలంగాణాలో సి.ఎం కేసిఆర్ పాలనా వ్యవహరాలతో ప్రజలు నానా అవస్థా పడుతున్నారని రాష్ట్ర బిజెపి నాయకుడు బండి సంజయ్ ద్వారా కేంద్రానికి బాగా ప్రచారం అవుతోంది. కేసీఆర్ కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారే తప్ప ప్రజల గోడు అంతగా పట్టించుకో వడం లేదన్నది గత కొంతకాలం నుంచీ విన వస్తున్న ఆరోపణ.
ఆయన కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టి రాష్ట్ర పాలనకు నిర్లక్ష్యం చేస్తున్నారనీ ప్రచారం జరిగింది. తమ పార్టీ వారికి కూడా ఆయను కలిసే అవ కాశం లేనంత దూరంగా వుండడం పార్టీ వర్గీయులకు, మంత్రులకు ఇబ్బందికరంగా మారింది. ఇదే విప క్షాల దాడికి అస్త్రంగా మారిందనాలి. కేసీ ఆర్‌కి ఏదన్నా విన్నవించుకోవాలంటే ఆయన బొత్తిగా అందు బాటులో వుండడం లేదని అధికారులూ విసి గెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర యంత్రాంగం మరింత చురుగ్గా జనాల్లోకి వెళ్లి తెలంగాణా ప్రభుత్వం తీరుతెన్నులు ఎలావున్నదీ తెలయజేస్తూ వారిని ఆకట్టుకునే పనిలో వున్నది.
అయితే ఈ వ్యూహం బిజెపికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది? ఏమేరకు విజయాన్ని అందిస్తుందనేది తెలియాలి. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో తెలంగాణాలో పాలన సరిగా లేదని, కుటుంబ పాలననుంచీ రాష్ట్రాన్ని విముక్తిచేయాలని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే అనేక వేదకలు, సభలలో ఇదే అంశాన్ని తెరమీదకి తెచ్చారు.
ఇంత జరుగుతున్నా, టిఆర్ ఎస్ ఎలాంటి కార్యక్రమానికి వ్యహం సిద్ధం చేయకపోవడం, కేసీఆర్ తన పార్టీ వర్గాలను సమాయత్తం చేయకపోవడం విచిత్రం. బిజెపి వారు ఆవేశపడుతున్నంతగా ఇక్కడేమీ లేదని, వారిది అంతా తాటాకు చప్పుళ్లే అని చలోక్తులు విసరడంతోనే కాలంగడిపేస్తున్నారు. రాష్ట్రానికి రావల సిన నిధుల విషయంలో, ఇక్కడి ప్రాజెక్టులకు అందించాల్సిన ఆర్ధిక మద్దతు విషయంలో మాట మాట్లా డని కేంద్రం రోజుకో నాయకుడిని తెలంగాణా పర్యటనకు పంపి ప్రభుత్వాన్ని తిట్టి పోయడం ఒక గొప్ప కార్యక్రమంగా పెట్టుకుందని కేటీఆర్ అంటూండటం షరామామూలే!
తెలంగాణాలో బిజెపి చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని, వారి ఎత్తుగడలు పారే అవకాశం లేదని ముఖ్యంమంత్రి కేసీఆర్ వీలయినపుడల్లా మంత్రులతో చెప్పిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు, కేంద్రం ఏమాత్రం సాయం చేస్తు న్నదీ తెలిసి కూడా ఇక్కడి బిజెపి నాయకులు తమ అధినేతకు చెప్పి చేయించడంలో విఫలమయి, ఇక్కడ కేవలం భజనబృందంగా మారారనేది టిఆర్ ఎస్ నాయకుల మాట! కానీ బిజెపీ స్పీడుకి మరి టిఆర్ ఎస్ బ్రేకులు వేయగల్గుతుందా?


