TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈడీ లేదు, బోడీ లేదు.. ముంద‌స్తు కూడా లేదు.. ఫైల్స్‌పై ఫైర్‌..

Published on: Mon Mar 21, 2022 6:39PM

కేసీఆర్ స్పీచ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక ప్రెస్‌మీట్ అంటే పండ‌గే. న‌వ‌ర‌సాలు ఒల‌క‌బోస్తారు. మాట‌ల‌తో ర‌క్తి క‌ట్టిస్తారు. పంచ్‌ల‌తో ప‌టాకా పేలుస్తారు. లేటెస్ట్ మీడియా స‌మావేశంలోనూ అలానే జరిగింది. మోదీ-బీజేపీ-వ‌రి లాంటి రొటీన్ స్పీచ్ త‌ర్వాత ఇక Q & A సెష‌న్‌లో అస‌లైన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

ఇటీవ‌ల బీజేపీ నేత‌ల నుంచి ప‌దే ప‌దే వినిపిస్తున్న మాట కేసీఆర్ అరెస్ట్‌.. త్వ‌ర‌లో జైలుకు. సోష‌ల్ మీడియాలోనైతే కావాల్సినన్ని స్టోరీలు. అదిగ‌దిగో ఐటీ రైడ్స్‌.. ఇక నెక్ట్స్ ఈడీ అటాక్స్ అంటూ వార్త‌లు. ఇవ‌న్నీ కేసీఆర్‌ను కాస్త క‌ల్లోల ప‌రుస్తున్న‌ట్టే ఉన్నాయి. ఆయా న్యూస్‌ల‌పై సీఎంవో వ‌ర్గాలు సైతం ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఈడీ రైడ్స్ గురించి నేరుగా కేసీఆర్‌నే ప్ర‌శ్నించారు జ‌ర్న‌లిస్టులు. తెలుసుగా కేసీఆర్ ఏం స‌మాధానం చెబుతారో?  లోప‌ల ఎంత ఆందోళ‌న ఉన్నా.. బ‌య‌ట‌కు మాత్రం గాంభీర్యం ప్ర‌ద‌ర్శించ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్‌. అందుకే, ఈడీ లేదు, బోడీ లేదు. అవ‌న్నీ దిక్కుమాలిన ప్ర‌చారాలు. ద‌మ్ముంటే ర‌మ్మ‌నండి. త‌న‌ను ట‌చ్ చేయ‌మ‌నండి. ఊరుకుంటామా? అంటూ త‌న‌దైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఈడీ రైడ్స్ అంటే భ‌యం లేన‌ట్టే క‌వ‌రింగ్ ఇచ్చార‌ని అంటున్నారు. 

ఇక ముంద‌స్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు కేసీఆర్‌. గ‌త ఎన్నిక‌ల ప‌రిస్థితులు వేరు.. ఇప్పుడు సిచ్యుయేష‌న్ వేరు. అప్పుడంటే ప్రాజెక్టులు పూర్తి కావాలి కాబ‌ట్టి అలా మాస్ట‌ర్ ప్లాన్ వేసాం. ఈసారి ముంద‌స్తు అవ‌స‌రం లేదంటూ తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 95 నుంచి 105 సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా తెలంగాణ‌లో 30 నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వేలు చేయించామ‌ని.. అందులో 29 స్థానాల్లో టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని స‌ర్వే రిపోర్టు చెబుతున్నాయని.. ఒక్క చోట మాత్రం 0.3 శాతం ఓట్ల తేడాతో ఓడిపోతామ‌ని వ‌చ్చింద‌ని కేసీఆర్ చెప్పారు. 
 
ఇక, క‌శ్మీర్ ఫైల్స్ పేరుతో బీజేపీ విచ్చిన్న‌క‌ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశానికి కావాల్సింది ఇరిగేష‌న్ ఫైల్స్‌, ఎక‌నామిక్ ఫైల్స్‌. ఇండ‌స్ట్రీ ఫైల్స్‌.. లాంటివి కానీ, ఈ ప‌నికిమాలిన కశ్మీర్ ఫైల్స్‌తో ఎవ‌రికి ఉప‌యోగం అంటూ బీజేపీని నిల‌దీశారు. ఎప్ప‌టిలానే కేసీఆర్ ప్రెస్‌మీట్ ఆయ‌న మాట‌ల గార‌డీతో రంజుగా కొన‌సాగింది. అయితే, కేసీఆర్ ఏం చెప్పినా.. ఆయ‌న మాట‌లు న‌మ్మే వారి సంఖ్య‌ మాత్రం అతి త‌క్కువే...అంటున్నారు.