చంద్రబాబు, ఎన్టీఆర్ సూపర్: కేసీఆర్ ప్రశంస
Published on: Tue Aug 19, 2014 10:22PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, హీరో జూనియర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి పొగిడారు. కేసీఆర్ మరొకరిని పొగడ్డమేంటి... పైగా చంద్రబాబుని పొగడ్డమేంటని అనుకుంటున్నారా? ఇది నిజంగానే నిజం. కేసీఆర్ వీరిద్దరినీ పొగిడింది సమగ్ర సర్వే విషయంలో! చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కు చెందినవారైనా సమగ్ర సర్వేలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు వివరాలు అందజేశారని కేసీఆర్ ప్రశంసించారు. అయితే సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారిని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో నివసిస్తూ.. తాగునీరు, లైట్లు, రోడ్లు తదితర ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించడం సామాజిక నేరమని విమర్శించారు. తెలంగాణలో అతిథులుగా, టూరిస్టులుగా ఉండాలని భావిస్తున్నవారే సర్వేలో పాల్గొనలేదని కేసీఆర్ చురకలు వేశారు. ఈ చురకలు సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని పవన్ కల్యాణ్, విజయశాంతి ఉద్దేశించి వేసినవేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


