TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ మంత్రివర్గం...శాఖల వివరాలు

Published on: Mon Jun 2, 2014 3:08PM

 

 

 

29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

 

మంత్రులకు కేటాయించిన శాఖలు :

1.  మహమూద్ అలీ - రెవన్యూ శాఖ
2.  రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ
3.  నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి
4.  ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ
5.  పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పపంచాయతీ రాజ్ శాఖ
6.  హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ
7.  పద్మారావు - ఎక్సైజ్ శాఖ
8.  మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ
9.  కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ
10.  జోగురామన్న - సాంఘిక సంక్షేమ శాఖ
11. జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ