Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ విచారణ ఇలా.. అప్పట్లో బాబు విచారణ అలా?
posted on: Jun 13, 2025 2:07PM

ఎలా అర్ధం చేసుకోవాలి గురూ!
మొన్నామధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వచ్చి ఆయన బంధువులను పరమార్శించిన విషయం గుర్తుందా? అప్పుడు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనపుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా కళ్లన్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడలేదు. ఎవరికీ ఎలాంటి బైట్ ఇవ్వలేదు. ఎలాంటి యాక్టివిటీ లేదు. కమిషన్ ఎదుట హాజరైయ్యారు. వెళ్లారు. వాళ్లు అడిగింది. కేసీఆర్ చెప్పింది. రికార్డుల్లో భద్రంగా ఉంటుందేమోగానీ కేసీఆర్ హావభావాలు ఏమంత తోట్రు పాటుకు గురైనట్టు కనిపించలేదు. అధికారం నుంచి దిగినోళ్లకి ఇదంతా సహజంర భయ్ అంటా ఒక ఈవెంట్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయారాయన.
అదే ఏపీలో చంద్రబాబు విచారణ సమయంలో నరాలు తెగే ఉత్కంఠ. ఆయన్ను అరెస్టు చేయడం నుంచి కోర్టులో ప్రవేశ పెట్టడం దగ్గర వరకూ హై టెన్షన్. ఆపై జైలుకు పంపడం వరకూ ఒక సుదీర్ఘమైన ఉత్కంఠ భరితమైన వ్యవహారం. ఈ మొత్తం మూడు నాలుగు ఎపిసోడ్లుగా సాగింది. ఎంతో ఎగ్జైట్ మెంట్ నడిచింది. మరీ ముఖ్యంగా ఆయన ఒక కుర్చీలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న పోజ్ అయితే బాబు అభిమానులను, టీడీపీ మద్దతుదారులను ఒక ఊపు ఊపేసింది. తీవ్ర స్థాయిలో చలించిపోయారంతా. బాబుకేమి జరుగుతుందో అన్న ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది. అప్పట్లో బాబు ఆయన అరెస్టు విచారణ జైలు జీవితం అదో పెద్ద చర్చ.
అదే ఇక్కడ కేసీఆర్.. వచ్చారు వెళ్లారు. అంతే మధ్యలో ఎలాంటి హైడ్రామా లేదు. ఒక పక్క కుమార్తె గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించే యత్నం చేస్తే ఆగు అన్నట్టు సైగ చేశారు తప్పించి.. ఆమెతో కనీసం మాట్లాడలేదు. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ ని మరీ ఇబ్బంది పెట్టే యత్నం చేసినట్టు కూడా కనిపించలేదు.బహుశా కేసీఆర్ ని అంతకన్నా మించి టచ్ చేయొద్దని రేవంత్ సర్కార్ అనుకుందో ఏమో. మధ్యలో ఎలాంటి తోట్రుపాటు, తడబాటు ఏదీ లేదు. అంటే అక్కడికి ఇక్కడికీ హై డ్రామాలో ఎంత మార్పు? ఇది ప్రాంతాల వారీగా ఉన్న తేడానా? లేక నాడు జగన్ చంద్రబాబును వేధించినంతగా.. నేడు రేవంత్ సర్కార్ కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం లేదనుకోవాలా? ఎక్కడో ఎమోషనల్ డ్రామా మిస్ అవుతోందని అంటున్నావాళ్లు లేక పోలేదు.
ఒక్క కవిత నుంచి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామాకు తెరలేపడం తప్ప.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనంలో కేసీఆర్ పట్ల రేవంత్ ప్రభుత్వ చర్యలపై కనీస స్పందన లేదు. ఈ విషయంలోని విభిన్నత గుర్తించిన చాలా మంది నాటి చంద్రబాబు విచారణ- నేటి కేసీఆర్ విచారణకు పోలిక తెస్తున్నారు. అంత హై డ్రామా లేదిక్కడ అంటూ కేసీఆర్ విచారణా పర్వాన్ని ఒకింత తేల్చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏదో ఒక ఈవెంట్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోవడంతో అదే కరెక్ట్ అనుకుంటున్నారు.






