TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే!

Published on: Wed May 18, 2022 6:42PM

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నమస్తే తెలంగాణ ఎండీ దివికొండ దామోదరరావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథి, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి  గాయత్రి రవి (వద్దిరాజు రవిచంద్ర)లను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు.  బండా ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా రాజీనామా చేయ‌డంతో తెలంగాణ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.

ఇక ధ‌ర్మ‌పురి శ్రీనివాస్, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో మ‌రో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మూడు స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు.సంఖ్యా బలం ఆధారంగా  ఈ మూడు రాజ్యసభ సీట్లు టీఆర్ఎస్ కే దక్కుతాయి. రాజ్యసభకు కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థులలో నమస్తే తెలంగాణ ఎండి దీవకొండ దామోదరరావు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కేటీఆర్ వెన్నంటే ఉన్నవారిలో ముఖ్యులు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పలు హోదాలలో పని చేశారు.

టీ న్యూస్ చానెల్‌కు తొలి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన దామోద‌ర్ రావు.. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. న‌మ‌స్తే తెలంగాణ‌ దిన‌ప‌త్రిక‌కు మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పార్థసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. ప‌లు విద్యాసంస్థ‌లు స్థాపించి విద్యావేత్త‌గా సేవ‌లందిస్తున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులుగా కొన‌సాగుతున్నారు.