TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ గడ్డపై కేసీఆర్, మమత భేటీ!.. ఇక దూకుడే...

Published on: Mon Feb 28, 2022 5:57PM

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’తో భేటీ. ఆ త‌ర్వాత‌ హ‌స్తిన నుంచి నేరుగా వార‌ణాసికి కేసీఆర్. అవును, కేసీఆర్.. ఢిల్లీలో కేజ్రీవాల్’ తో భేటీ త‌ర్వాత ప్రధానమంత్రి నరేద్ర మోడీ పార్లమెంటరీ సొంత నియోజక వర్గం వారణాసి గడ్డ పై కాలు పెడుతున్నారు. అక్కడ ఆయన మమతా బెనర్జీతో సమావేశమవుతారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే, దేశంలో మోడీ బద్ద విరోధులుగా జాతీయ రాజకీయాల్లో,చక్రం తిప్పుతున్న ఈ ఇద్దరు, వారణాసిలో ఎందుకు, కలుస్తున్నారు? ఏమిటి ‘వ్యూహం’ అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇద్దరూ మోడీ సొంత సొంత గడ్డ నుంచే ఆయనకు సవాలు విసురుతారా, లేక ఇంకేడైనానా అనేది ఇంకా స్పష్టం కావలసి వుంది. 

అదలా ఉండగా, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుంబిగించిన కేసీఆర్, మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారు.ఈ మూడు రోజుల్లో  ఆయన అరవింద్ కేజ్రీవాల్’, మమతా బెనర్జీతో పాటుగా మరికొందరు ప్రాంతీయ పార్టీల  నేతలతోనూ సమావేశ మవుతారు. అలాగే, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సమావేశమై, వివిధ అంశాలపై వారితో చర్చిస్తారని సమాచారం. 
అయితే, గత కొంత కాలంగా కేసేఆర్ సాగిస్తున్న కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికే, తమిళనాడు, మహరాష్ట్ర ముఖ్యమంత్రులు స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటుగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తోనూ సమావేసమయ్యారు. అయిన వరి నుంచి అంతగా సానుకూల స్పందన రాలేదు. 

అయితే, ఇంతవరకు జరిగిన ప్రయత్నాలు  ఒకెత్తు అయితే, ఇప్పడు,కేజ్రీవాల్, మమతా బెనర్జీని కలవడం ఒకెత్తు అంటున్నారు. ఇంతవరకు కేసీఆర్ కలిసిన నేతలు అంతా కాంగ్రెస్ కూటమిలో ఉన్నవారే, కానీ, ఇప్పుడు కేసీఆర్ కలుస్తున్న కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇద్దరూ కూడా కాంగ్రెస్, బీజేపీలను సమానంగా వ్యతిరేకిస్తున్న నాయకులు కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ సూత్రదారిగా సాగుతున్న  ఈ భేటి తృతీయ కూటమి ఏర్పాటులో కీలక ముందదుగు కాగలదని అంటున్నారు.