కెసిఆర్ ప్రకటనకు అర్థం వుందా?
Published on: Tue Nov 5, 2013 10:32AM
.jpg)
మెట్రో రైలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మారిందని, తెలంగాణ వచ్చాక అవసరమైతే దాన్ని కూల గొడతామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ప్రకటించేసారు. అసలు ఈ ప్రకటనకు అర్థం పర్థం ఏమన్నా వుందా? అవకతవకలు జరిగి వుండొచ్చు. వాటిని వెలికి తీయాలి, సరిచేయాలి కానీ, కూలగొడతాం అనడం ఎంత వరకు సబబు? అసలు అది సాధ్యమా? ఒప్పందాలు, సంతకాలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ పకడ్బందీగా వుంటాయి కదా? కెసిఆర్ ప్రకటన కేవలం రెండు విధాల మాత్రమే పనిచేస్తుంది. ఒకటి ప్రజలను రెచ్చగొట్టి తనతో ఇంకా మరి కొంత దూరం తీసుకెళ్లేందుకు.!. రెండవది ఎల్ అండ్ టి లాంటి సంస్థను బ్లాక్ మెయిల్ చేసి, ఎన్నికల నిధులు సంపాదించుకునేందుకు..!


