శుక్రవారం ప్రభుత్వం ధర్నా.. కేంద్రంపై కేసీఆర్ యుద్దం..
Published on: Mon Nov 8, 2021 4:02PM
కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్. తెలంగాణ పండించిన ధాన్యాన్ని కొనాలంటూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కేసీఆర్ పిలుపిచ్చారు. శుక్రవారం రైతులతో కలిసి అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రైతుల కోసం ఎక్కడి వరకైనా వెళతానని కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ పండించిన ధాన్యాన్ని కేంద్రం కొని తీరాల్సిందేనని స్పష్టం చేశారు.


