TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ తో ఏసీబీ డీజీ భేటీ

Published on: Thu Jul 2, 2015 12:47PM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తో భేటీ ఆయ్యారు. ఈ నేపథ్యంలో వారివురు ఓటుకు నోటు వ్యవహారం గురించి చర్చించనున్నట్టు సమాచారం.. ఇప్పటి వరకూ ఈ కేసులో జరిగిన పరిణామాలు.. భవిష్యత్ లో చేయాల్సిన కార్యాచరణలు తదితర అంశాల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బెయిల్ రావడం.. అనంతరం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.