TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీకే 'ఫీజ్‌' ఎంతో చెప్పేసిన కేసీఆర్‌.. అవునా? నిజ‌మా?

Published on: Mon Mar 21, 2022 6:16PM

ప్ర‌శాంత్ కిశోర్‌. ఐప్యాక్ అధినేత‌. గెలిపించ‌డంలో ఆయ‌న ట్రాక్ రికార్డ్ భేష్‌. వంద‌లు-వేల కోట్లు ఫీజుగా తీసుకొని.. గొడ‌వ‌లు, వివాదాలు సృష్టించి.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి.. ఎలాగోలా ఏదైనా చేసి.. త‌న క్లయింట్‌ను గెలిపిస్తార‌ని అంటారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌రెడ్డి-వైసీపీ నుంచి 1000 కోట్ల వ‌సూలు చేశార‌ని అంటారు. స్టాలిన్‌, మ‌మ‌త‌ల‌కు ప‌ని చేసి.. లేటెస్ట్‌గా కేసీఆర్‌తో క‌లిసి వ‌ర్క్ చేస్తున్నారు. పీకేతో 300 కోట్ల‌కు డీల్ కుదిరింద‌నే టాక్ అయితే ఉంది. అయితే, అంత లేదంటూ సీఎం కేసీఆర్ పీకే ఫీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న రేట్ ఎంతో చెప్పేశారు. ప‌నిలో ప‌నిగా ప్ర‌శాంత్ కిశోర్‌ను తెగ పొగిడేశారు. కేసీఆర్ మాట‌లు విన్నాక‌.. పీకే ప‌క్కాగా ఫుల్‌ ఖుషీ అయి ఉంటారు. నైట్ నిద్ర కూడా ప‌ట్ట‌క పోవ‌చ్చు. అవును మ‌రి, ఆయ‌న్ను ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ అంత‌గా పొగిడి ఉండ‌క‌పోవ‌చ్చు. 

ప్ర‌శాంత్ కిశోర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు సీఎం కేసీఆర్‌. పీకేతో త‌న‌కు ఏడేళ్లుగా మంచి స్నేహం ఉందంటూ.. ఇది సీక్రెట్ అంటూ రివీల్ చేశారు. ఆయ‌న యూఎన్‌వోలో ప‌ని చేశాడ‌ని.. ఇండియా తిరిగొచ్చాక‌.. దేశం కోసం ప‌ని చేస్తున్నాడ‌ని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంత‌కీ పీకేతో 300 కోట్ల‌కు డీల్ కుదుర్చుకున్నార‌ట‌గా.. అని విలేక‌ర్లు ప్ర‌శ్నించ‌గా కేసీఆర్ ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు. 

ఇంత వ‌ర‌కూ ప్ర‌శాంత్ కిశోర్ ఎవ‌రి ద‌గ్గ‌రా రూపాయి కూడా ఫీజు తీసుకోలేద‌ని.. ఆయ‌న డ‌బ్బుల కోసం ప‌ని చేయ‌రంటూ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. ఎవ‌రైనా ఆయ‌న సాయం కోరితే.. ఉచితంగా వారి కోసం వ‌ర్క్ చేస్తార‌ని.. అంతేగాని ఇన్నికోట్లు, అన్నికోట్లు అనేదంతా అవాస్త‌వ‌మ‌ని.. పీకే చాలా మంచి మ‌నిషంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, కేసీఆర్ అలా చెప్పారు కానీ.. ఆయ‌న చెప్పిందంతా నిజ‌మేనా? అనే అనుమానం. అబ్బ‌చా.. న‌మ్మాలా? అంటూ సెటైర్లు. అవును, పీకే డ‌మ్ములు తీసుకోరు.. వంద‌లు-వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకుంటారంటూ కామెంట్లు. ఇలా, కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై డివైడ్ టాక్ వినిపిస్తోంది. 

also read: ఎవ‌రీ ప్ర‌శాంత్ కిశోర్‌?.. పీకేకు ఎందుకంత డిమాండ్‌?