కేసీఆర్‌ అక్కడికి వెళ్తారా వెళ్లరా?

 

ఇప్పుడు దేశం చూపంతా కర్ణాటక వైపే ఉంది. మోదీ, అమిత్ షాల రాజకీయ చతురతను తట్టుకొని అక్కడ కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పడబోతోంది. దేవగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టబోతున్నారు. ఆ ప్రమాణస్వీకార వేడుకకు మమత, మాయావతి, చంద్రబాబు, కేసీఆర్‌లను సగౌరవంగా ఆహ్వానించారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌ ఆ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు అందరి ముందూ ఉన్న పజిల్‌. ఆయన అక్కడికి వెళ్తే కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్లు అవుతుంది. మూడో కూటమిని తక్కువ చేసినట్లవుతుంది. పైగా చంద్రబాబుతో ముఖాముఖి తలపడాల్సి ఉంటుంది. వెళ్లకపోతే బీజేపీ వ్యతిరేక పక్షాలను అవమానించినట్లు అవుతుంది. మరి కేసీఆర్ నిర్ణయం తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే