TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కు తప్పిన ప్రమాదం... హెలికాప్టర్‌ లో పొగ

Published on: Tue Feb 27, 2018 2:47PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రమాదం తృటిలో తప్పింది. ఈరోజు ఆయన  ఆదిలాబాద్ పర్యటనకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే  హెలికాప్టర్‌లోని ఓ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ సెట్‌ ఉన్న బ్యాగు నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ బ్యాగును చాకచక్యంగా బయట పడేశారు. దీంతో కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనపై ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తాను ఫోన్‌లో సంప్రదించానని, సీఎంకి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పారు.