రేవంత్ కు కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్.. షాక్ లో రేవంత్..


తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడు లేని ఉత్కంఠంగా మారుతున్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్పాడో అప్పటి నుండి ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. అదేంటంటే.. రేవంత్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పుష్ప గుచ్చం పంపించారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. కేసీఆర్, రేవంత్ కు మధ్య ఉన్న గొడవ గురించి తెలిసింది. ఇద్దరూ నిప్పు ఉప్పులా ఉంటారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గు మనే పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకంగా కేసీఆపై యుద్దం చేయడానికే కాంగ్రెస్ లో చేరానని చెప్పాడు. అలాంటిది.. కేసీఆర్ కు పుట్టినరోజు  శుభాకాంక్షలు చెప్పి... ఒక లెటర్ కూడా పంపారట కేసీఆర్. అందులో “దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మీరు ప్రజాసేవలో మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలి” అంటూ సందేశం ఇచ్చారట. ఇక కేసీఆర్ చేసిన ఈ పనికి రేవంత్ తో పాటు అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ లెటర్ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు ఇదెక్కడి రాజకీయంరా బాబు అంటూ కొంతమంది నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయాలలో తెలివి ఉండాలి..కోపం ఉండాలి..ప్రేమ చూపించాలి అని కేసీఆర్ మరోసారి తన రాజకీయ తెలివితేటలు చూపించారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... కేసీఆర్ ఇచ్చిన ఈ ట్విస్ట్ కు ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో గుబులు పట్టుకుందట. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నసామెత ప్రకారం.. అసలు రేవంత్ రెడ్డి టీడీపీ ని వదిలి వెళతాడా అని అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అలాగే ఏమో ముందు ముందు ఏం జరుగుతుందో.. కేసీఆర్ పై కోపం పోతుందేమో... ఏం చెప్పగలం... రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా...