రాజీనామా వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అదా...!

 

ఏపీలో నంద్యాల ఎన్నికల్లో,  కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచి టీడీపీ తన సత్తా చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి వైసీపీకి టీడీపీ తమ సత్తా ఏంటో చూపించిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందుకే కేసీఆర్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఉపఎన్నిక తీసుకొచ్చి అందులో గెలిచి ప్రతిపక్ష పార్టీలకు బుద్ది చెప్పాలని చూస్తున్నారని..అందుకే రాజీనామా చేయించారని అన్నారు. అయితే కేసీఆర్ ఆలోచన వెనుక వేరే ఆలోచన ఉందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం ఏంపీ గా ఉన్న గుత్తా సుఖేందర్ ను రాష్ట్ర రైతు సమన్వయ కన్వీనర్ గా నియమించాలని కేసీఆర్ దాదాపు నిర్ణయించేసుకున్నారట. అయితే సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నందున ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చేందుకు నియమాలు అడ్డొస్తున్నాయి. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు గుత్తా ద్వారా రాజీనామా చేయిస్తే మరో లాభం లాభం కూడా ఉంటుందని... కాంగ్రెస్ నేతల నోటికి తాళం వేయొచ్చని చూస్తున్నారట. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్, జానారెడ్డి.. లాంటి నేతలందరూ నల్గొండ జిల్లావాసులే. అదే స్థానానికి ఉపఎన్నిక తెచ్చి.. అక్కడ నెగ్గి తన సత్తా చాటాలని.. తద్వారా వాళ్లందరి నోటికి తాళం వేయాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో..? ఉపఎన్నికలో గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తారో...? లేదో..? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.