కేసీఆర్ కు షాకిచ్చిన సర్వే.... టీడీపీ జోష్.. టీఆర్ఎస్ వీక్...

 

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఎలాంటి ఢోకా లేదన్న నిజం తెలిసిందే. అక్కడ ప్రతిపక్ష పార్టీల బలం అంతగా లేకపోవడం.. కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానంతో ఇప్పుడప్పుడే వేరే పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు అని కూడా తెలుసు. అలాంటి కేసీఆర్ కు ఇప్పుడు ఓ షాక్ తగిలిందట.

 

కేసీఆర్ అప్పుడప్పుడు సర్వేలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనే కాదు.. ఏపీలో కూడా ఆయన ఈమధ్య సర్వేలు నిర్వహించారు. ఆంధ్రాలో అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌ పార్టీ గెలుస్తుందని ఒకటే ఊదరగొట్టారు. అంతేకాదు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ 5-10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంద‌ని సర్వేలో తేలింద‌ని, కేసీఆర్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ కేసీఆర్ చెప్పినదానికి రివర్స్ లో 27 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించి కేసీఆర్ కు షాకిచ్చింది. ఇప్పుడు తాజాగా మరో సర్వే చేయించగా.. మళ్లీ కేసీఆర్ కు షాక్ తగిలినట్టు తెలుస్తోంది.

 

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ ఒంట‌రిగా పోటీ చేస్తే 139 సీట్లు, జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే 157 సీట్లు వ‌స్తాయ‌ని తేలింద‌ట‌. ఇక ఈ రెండు పార్టీల కూట‌మికి 22 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని కూడా స‌ర్వే చెప్పింద‌ట‌. ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టిఆర్‌ఎస్‌కు 45 సీట్లకు మించి రావట. తాజా సర్వే ప్రకారం టిఆర్‌ఎస్‌కు 45, కాంగ్రెస్‌కు 45, ఎంఐఎంకు 5, టీడీపీ+బీజేపీకి 20 వ‌ర‌కు, సీపీఐ, సీపీఎంకు చెరో సీటు వ‌స్తాయ‌ని తేలింద‌ట‌. దీంతో కేసీఆర్  కొత్త టెన్షన్ లో పడ్డారట. ఇప్పటివరకూ తమ పార్టీకి ఎలాంటి ఎదురులేదనుకున్న పార్టీ నేతలకు.. ఈ సర్వే భారీగానే షాకిచ్చింది. మరి ఇప్పటివరకూ కేసీఆర్ చెప్పిన సర్వేలు రివర్స్ అయ్యాయి.. ఇప్పుడు ఈ సర్వే ఎంత వరకూ నిజమవుతుందో..? లేక అది కూడా రివర్స్ అవుతుందో..? లేదో..? చూద్దాం.