TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గులాబీ బాస్‌‌ కేసీఆర్‌కు బిగ్ షాక్..కాళేశ్వరం కమిషన్ నోటీసులు

Published on: Tue May 20, 2025 2:31PM

 

బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు భారీ షాక్ తగిలింది. గులాబీ బాస్‌తో పాటు పాటు మాజీమంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకోవడంతో.. తెలంగాణ సర్కారు కమిషన్ గడువును 2025 జూలై 31 వరకు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలు రావడంతో జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. 

అయితే గులాబీనేత గతంలో నరసింహారెడ్డి కమిషన్ విచారణను న్యాయస్థానంలో సవాలు చేసి, దాని చైర్మన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఘోష్ కమిషన్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు పని చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ పని చేశారు . ఈ తరుణంలోనే కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.