కేసీఆర్ పచ్చి మోసగాడు
Published on: Wed Feb 15, 2012 1:54PM
సోనియా అపాయింట్ మెంట్ కోసం నావద్ద ప్రాధేయపడ్డాడు
తెలుగువన్.కామ్ తో మాజీ మంత్రి షబ్బీర్ అలీ
హైదరాబాద్: తెలంగాణా
రాష్ట్రసమితి అధినేత కె.చంద్రశేఖరరావు పచ్చి మోసగాడని గల్ఫ్ కు వీసాల పేరుతో పేద నిరుద్యోగ యువకుల్ని సైతం మోసగించడానికి వేనుకాదలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు.ఆయన తెలుగువన్.కామ్ తో మాట్లాడుతూ కేసీఆర్ అన్నకు కూడా నేర చరిత్ర ఉందని ఇప్పుడు కేసీఆర్ వారసులైన మేనల్లుడు,కొడుకు కూతురు కూడా ఉదయం పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. నిమ్స్ లో కేసీఆర్ చికిత్స పొందుతునప్పుడు తెలంగాణా విషయంపై సోనియా గాంధీతో మాట్లాడించమని పదే పదే తనను వేడుకొన్నాడని, అలాగే ఢిల్లీలో సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసం హరీష్ రావు తన వద్దకు వచ్చి వేడుకునారని, తాను స్పందించి వారికి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించానన్నారు.ఇది వాస్తవం కాదని వారు చెబితే తాను మసీదు ఎక్కుతానని, వారు ఆలయమెట్లు ఎక్కాలని సవాల్ విసిరారు. ఈ ప్రపంచంలో కేవలం డబ్బుకోసం ఉద్యమాలు చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు పడే ప్రతి ఓటును కేసీఆర్ కుటుంబసభ్యులు తరువాత నోట్లుగా మార్చుకుంటారని, అందువల్ల వారికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ప్రజలను కోరారు.


