కెసిఆర్ పరామర్శించారా? నామా
Published on: Fri Jan 6, 2012 3:47PM
హై
దరాబాద్: కెసిఆర్ ఒక్క కుటుంబానైన్నా పరామర్శించారా అని టిడిపి సీనియర్ నేత చంద్రశేఖర్ ప్రశ్నించారు. టిడిపిని ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల సంఖ్యలో రైతులు చనిపోయినా, తెలంగాణ రైతుల ఆత్మహత్యల గురించి కెసిఆర్ ఏనాడైనా పార్లమెంటులో ప్రస్తావించారా అన్నారు. రైతుల గురించి పట్టించుకోని కెసిఆర్‌కు రైతుల కోసం పోరు యాత్ర చేస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి చంద్రబాబుపై రాళ్లు వేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం చంద్రబాబు చేస్తున్న పాదయాత్రతోనైనా కెసిఆర్‌కు బుద్ధి రావాలన్నారు. తెరాసపై టిడిపి తెలంగాణ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, టి. దేవేందర్ గౌడ్ కూడా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇవ్వబోమని ప్రధాని చేత చెప్పించింది కెసిఆరేనని మోత్కుపల్లి అన్నారు.


